తెలంగాణ వార్డుమెంబర్స్ ఫోరం (T.W.F) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బత్తిని సంతోష్

తెలంగాణ రాష్ట్రంలో వార్డుమెంబర్ల హక్కుల సాధన,ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర వార్డుమెంబర్స్ ఫోరం (T.W.F) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి వార్డు సభ్యులు బత్తిని సంతోష్ ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొండ నవీన్,చెన్న కుమారస్వామి ఉత్తర్వులు జారీచేశారు.ఈ సందర్బంగా బత్తిని సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వార్డుమెంబర్లు క్షేత్రస్థాయిలో కీలక పాత్ర వహిస్తున్న సరైన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కేవలం వార్డుమెంబర్ల కు మాత్రమే ఉంటుందని కానీ వాళ్ళు కేవలం తీర్మాణాల్లో సంతకాలకే పరిమితం అవుతున్నారని.కనీసం మండల స్థాయి అధికారులు కూడా వార్డుమెంబర్ల ప్రాముఖ్యత గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా వార్డుమెంబర్ల ఐక్యత హక్కులకోసం,వారి ఆత్మగౌరవం,సముచిత ప్రధాన్యత కోసం పోరాడతామని పేర్కొన్నారు.వార్డుమెంబర్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం ప్రకటించాలని,గ్రామ పంచాయితీ నిధులను వార్డుల వారిగా కేటాయింపులు చేస్తూ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.శిక్షణ తరగతులు నిర్వహించి పంచాయితీ చట్టాలపై అవగాహన పెంచాలని కోరారు. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.