చే గు వీర – విప్లవ వీరుడు

చే గు  వీర – విప్లవ వీరుడు

చే గు  వీర …… అసలు పేరు ఏర్నెస్టో “చే” గువేరా. ఈయన 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మిచాడు. చే గువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి.

జీవితాన్ని మార్చిన ప్రయాణం..
వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్‌ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్‌ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్‌ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు.

సమాజానికి వైద్యం..
డాక్టర్‌ పట్టా చేతికొచ్చిన చే గువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి… బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్గించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంతపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత  క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు.

Che Guevara Life Story Book

Che Guevara Quotes

More Information Visit: Che Guevara

omkrish