Hima Das Biography

Hima Das Biography

హిమా దాస్ అస్సాం రాష్ట్రంలోని నాగోల్‌ జిల్లా డింగ్ పట్టణానికి సమీపం లో ఉన్న కంధూలిమారి గ్రామంలో రోంజిత్ మరియు జోనాలి దాస్ దంపతులకు జన్మించాడు. ఆమె తల్లిదండ్రులు వృత్తి రీత్యా రైతు లు. ఆమె ఐదు గురు పిల్లలలో చిన్నది. ఆమె డింగ్ పబ్లిక్ హైస్కూల్లో చదివింది మరియు ప్రారంభం లో ఫుట్‌బాల్ ఆడటంలో పాల్గొంది.హిమా దాస్ డింగ్ ఎక్స్‌ప్రెస్ అనే మారు పేరుతో, అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రజలు  పిలుస్తారు. షంసుల్ హోక్ సలహాలతో ఫుట్ బాల్ ను0చి పరుగులు ప్రాక్టీసును మొదలు పెట్టింది.పూర్తిగా కొండలు, లోయలతో నిండివున్న ప్రాంతం. పాఠశాలకు వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర నడవాలి. కొండకోనలు దాటాలి. అలా నడుస్తూ.. పరుగెత్తుతూ రాటుదేలింది హిమ దాస్‌. పేద కుటుంబానికి చెందిన హిమ.. ఆరుగురు సంతానంలో పెద్దమ్మాయి. పాఠశాల చదవు కోసం కిలోమీటర్ల కొద్ది కొండలు దాటిన హిమ సహజసిద్ధమైన అథ్లెట్‌గా ఎదిగింది. రోజూ తండ్రితో పాటు పొలం పనులు చేస్తూ మరింత దృఢంగా తయారైంది. అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టిన హిమ.. సరైన వసతులు లేకపోయినా సాధన కొనసాగించింది. బురదలా ఉండే ఫుట్‌బాల్‌ మైదానం లో ప్రాక్టీస్‌ చేసింది. 

ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్‌.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి.

హిమాదాస్. ఆడపిల్ల కాదు. ఆడపులి. ప్రస్తుతం ఆమెను ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే.. 130 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకొనేంత ఘనకార్యాన్ని సాధించింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో కేవలం 18 రోజుల్లో ఐదో గోల్డ్ మెడల్ సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది. 52.09 సెకన్ల రికార్డు సమయంలో ఆమె ఈ ఘనతను సాధించింది. 2018లో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఆమె వ్యక్తిగత రికార్డు (50.79) కంటే ఇది రెండు సెకన్లు ఎక్కువ. అసోంకి చెందిన 19 ఏళ్ల అథ్లెటిక్ చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న పోటీల్లో ఇప్పటి వరకు ఐదు గోల్డ్ మెడల్స్ సాధించింది. అయితే, 400 మీటర్ల వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. అర్హత సాధించేందుకు 51.80 సెకన్లలోనే గమ్యాన్ని చేరాల్సి ఉంది. అయితే, తృటిలో చాన్స్ మిస్ అయింది.

కెరీర్లో మైలురాళ్లు:

-అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సాధించింది.

-2019, జులై 20: జెచ్ రిపబ్లిక్‌లోని నోవె మెస్టే వేదికగా జరిగిన 400 మీటర్ల ఈవెంట్లో 52.09సెకన్లలో పరుగు పూర్తి చేసుకుని గోల్డ్ దక్కించుకుంది.

-2019, జులై 17: జెచ్ రిపబ్లిక్‌లోని టాబోర్ అథ్లెటిక్స్ 200మీటర్ల ఈవెంట్లో 23.25 సెకన్లలోనే పరుగును పూర్తి చేసుకుని స్వర్ణాన్ని దక్కించుకుంది.

-2019, జులై 13: జెచ్ రిపబ్లిక్‌లోని క్లాడో అథ్లెటిక్స్ 200మీటర్ల ఈవెంట్లో 23.43 సెకన్లలోనే పరుగును పూర్తి చేసుకుని స్వర్ణాన్ని సంపాదించగలిగింది.

-2019, జులై 7: పోలాండ్‌లోని కుట్నో అథ్లెటిక్స్ 200 మీటర్ల ఈవెంట్లో 23.97 సెకన్లలోనే పరుగును పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది.

-2019, జులై 2: పోలాండ్‌లోని పొజ్నన్ అథ్లెటిక్స్ 200 మీటర్ల ఈవెంట్లో 23.65 సెకన్లలోనే పరుగును పూర్తి చేసి గోల్డ్ దక్కించుకుంది.

అవార్డులు
-హిమదాస్‍‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018లో అర్జున్ అవార్డు ఇచ్చి సత్కరించింది. 
-యూనిసెఫ్ ఇండియాకు 2018లో ఫస్ట్ యూత్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. 
-అంతర్జాతీయ ఈవెంట్లో భోగేశ్వర్ బరువా తర్వాత అస్సాం నుంచి గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్‌గా హిమ చరిత్రకెక్కింది. 
-అస్సాం ప్రభుత్వం హిమదాస్‌ను స్పోర్ట్స్ అంబాసిడర్‌గా నియమించింది. పీటీ ఉషను గుర్తు చేస్తూ 19ఏళ్లకే స్ప్రింటర్‌గా అంతర్జాతీయ ఈవెంట్లో సత్తా చాటింది.
-2020 టోక్యో ఒలింపిక్స్‌లో హిమ దాస్ మరెన్ని అద్భుతాలు సృష్టించగలదో చూడాలి మరి.

omkrish

Leave a Reply

Your e-mail address will not be published.