రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్(ISRO Chairman)

ఇతని పూర్తిపేరు కైలాసవడివు శివన్ భారత శాస్త్రవేత్త, ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ‘ (ISRO) కు తొమ్మిదవ చైర్మన్. ఇస్రో చైర్మన్ కాక మునుపు శివన్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు.
కైలాసవడివు శివన్ 1957 ఏప్రిల్ 14 న, మేల సరక్కలవిలై గ్రామం, నాగర్‌కోయిల్, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు లో జన్మించాడు. శివన్ తండ్రి కైలాస వడివు వ్యవసాయం చేసేవాడు, తల్లి చెల్లమ్ గృహిణి. ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. నాగర్‌కోయిల్ హిందూ కాలేజీలో మేథమెటిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశాడు. 1980లో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, 1982లో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( ఐఐఎస్ ) ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
1982లో ఇస్రో లో ఉద్యోగంలోకి చేరాడు. అక్కడ ఉద్యొగం చేస్తూనే బాంబే ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు. 2014లో ‘లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ సెంటర్’ డైరెక్టర్‌గా ఉన్నాడు. 2015లో ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ డైరెక్టర్‌గా పని చేశాడు..
భారత్ రాకెట్ మ్యాన్
పోఖ్రాన్ –1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజినిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసే బృందాన్ని ముందుండి నడిపించిన శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు.
► ఈ మధ్య ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ చేసిన పరిశోధనలు, డిజైన్ చేసిన ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
► శివన్ డిజైన్ చేసిన సితార అన్న సాఫ్ట్‌వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది.
► మంగళ్‌యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు సైతం శివన్ వెన్నెముకలా ఉన్నారు.
► ఇటీవల కాలంలో ఇస్రో పరీక్షిస్తున్న మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలయ్యే లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకి శివన్‌దే సారథ్యం.
► లక్ష్య సాధనలో ఈ రాకెట్ మ్యాన్ ఇప్పుడు కాస్త నిరాశకు లోనవచ్చు కానీ దేశ ప్రజలిచ్చే మద్దతే ఆయనకు కొండంత బలం. చీర్ అప్ శివన్…
Recently launched: Chandrayaan-2
Book : Kailasavadivoo Sivan
Award