నేను ఒక్కప్పుడు వలస కార్మికుడినే…సోనూ సూద్

నేను ఒక్కప్పుడు వలస కార్మికుడినే…సోనూ సూద్

వలస కూలీల పాలిట ఆపద్భాంధవుడు అయ్యారు నటుడు, నిర్మాత సోనూ సూద్‌. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలమంది వలస కూలీలు సోనుసూద్‌ సాయంతో వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. సోనూ సూద్‌ చేస్తున్న ఈ సాయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

పొట్ట చేత పట్టుకొని #ముంబయ్ వలస వచ్చిన వాడినే..!! రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలో బాతరుమ్ పక్కన్న తలుపు పట్టుకొని వేలాడుతూ ఎన్నోసార్లు ప్రయాణాలు చేసాను.. #ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు.
అందుకే లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయి తిండి లేక సొంతూరు చేరుకునే మార్గం లేక వాళ్ళు పడుతున్న అవస్థలు చూసి వేల కిలోమీటర్లు పిల్లలతో కొంత మంది కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతుంటే మనసు చలించిపోయింది..నా కెరీర్ మొదట్లో నేను పడిని కష్టాలు కళ్ళ ముందు మోదిలాయి.. సహాయ కార్యక్రమాల్లో మొదటి అడుగుగా జుహు లోని నా హోటల్ని ప్రాణాలు పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న వైద్యులకు ఇచ్చాను..ముంబయ్ పరిసర ప్రాంతాల్లో పట్టేడు అన్నం లేక అలాంటిస్తున్న దాదాపు 40 వేల మందికి అన్నదానం మొదలు పెట్టాను.తరవాత ఇంకా ముంబయ్ కి దూరంగా వంటగదులు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన భోజనం తయారుచేసి వడ్డించామ్.
ఆకలి తీరినా వాళ్ళ కళ్ళలో ఎదో తెలియని బాధ.. ఏంటని అడిగితే మా సొంత గ్రామలకి పంపించండయ్య అని ఆడిగేసరికి ఆలోచించకుండా అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేసాం..వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కళ్ళలో నుండి వస్తున్న #కనీళ్ల చూసి చలించిపోయాను.ఒక గర్భిణి ఇంటికి చేరుకున్నాక ప్రసవించి తన కొడుకుకి సోనూసూద్ శ్రీవాత్సవ్ అని పేరు పెట్టుకుంది..ఎక్కడ వలస కార్మికులు ఉంటే అక్కడకి వెళ్లి నాకు అవకాశం ఇవ్వండి మిమల్ని మీ గ్రామాలకి పంపుతాను అని అడిగి కొన్ని వేల మందిని వాళ్ళ స్వస్థలాకి పంపాను..వాళ్ళు వెళ్ళుతూ నాపైన చూపించిన ప్రేమ వారి కళ్ళలో ఆనందం చూసి #ఇక ఈ జన్మకి ఇది చాలు అనుకున్న..
నాకు తోడుగా నా భార్య పిల్లలు…స్నేహితులు సహకారం..మరి ముఖ్యంగా అధికారులు పోలీసులు తోడ్పాటు మరువలేనిది…

 ఒడిశాకు చెందిన దాదాపు 180 మంది అమ్మాయిలు.. కేరళలోని ఎర్నాకులంలో చిక్కుకుపోయారు. అక్కడే కుట్టుపనులు చేసుకుని ఉపాధి పొందుతున్న వీరు.. లాక్‌డౌన్‌ వల్ల పనిచేసే ఫ్యాక్టరీ మూత పడటంతో సంకట స్థితిలో పడిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి సరైన మార్గం కనిపించకపోవడంతో కేరళలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ సూద్‌ వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేసి.. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఇక లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేరుస్తున్న సోనూసూద్‌.. హెల్త్‌వర్కర్ల కోసం పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడంతో పాటుగా తన హోటల్‌ను కూడా క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చి రియల్‌ హీరో అంటూ నీరాజనాలు అందుకుంటున్నారు

The Real Hero In India – Sonu Sood

omkrish