సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకున్న తొలి గిరిజన యువతి

సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకున్న తొలి గిరిజన యువతి

కృషి, నిరంతరం పట్టుదల ఉంటే సాధించనిది అంటు ఏమీ లేదు అని నిరూపించింది ఓ గిరిజన అమ్మాయి.కేరళకు చెందిన శ్రీధన్య సురేశ్(22) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2018 ఫలితాల్లో 410 ర్యాంకు సాధించింది.

కేరళలోని వయనాడ్ జిల్లా పొజుథానా గ్రామానికి చెందిన కురిచియ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయిని నేను. అమ్మ కమల, నాన్న సురేశ్.. ఇద్దరూ రోజువారీ కూలీలే. విల్లులు-బాణాలు తయారుచేస్తూ వాటిని దగ్గర్లోని మార్కెట్లో అమ్ముతూ మమ్మల్ని పోషించేవారు. ఆ కొంత డబ్బుతోనే మా కుటుంబం (అమ్మా-నాన్న, మేం నలుగురు పిల్లలం) గడిచేదంటే మా ఆర్థిక పరిస్థితేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడైనట్లుగా అమ్మానాన్నల రోజువారీ కూలీకి తోడుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) కింద కొంత మొత్తం అందుతుంది. ఇక ప్రస్తుతం నా సోదరి ఓ గవర్నమెంట్‌ ఆఫీస్‌లో సర్వెంట్‌గా పనిచేస్తోంది. తమ్ముడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

అత్యంత వెనుకబడిన ప్రాంతం వయనాడ్ నుంచి తొలిసారిగా సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిగా శ్రీధన్య చరిత్ర సృష్టించింది.కేరళ నుంచి ఒక గిరిజన అమ్మాయి తొలిసారిగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.శ్రీధన్యకు ఉన్న పట్టుదల, చిత్తశుద్ధి వల్లే ఆమె కల సాకారమైందన్నారు.

ఈ సందర్భంగా శ్రీధన్య మాట్లాడుతూ.. కేరళలో అత్యంత వెనుకబడ్డ జిల్లా నాది. అక్కడ ఎవరూ గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. నాకు ఇప్పుడు సివిల్స్ రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని శ్రీధన్య తెలిపారు.

Full information visit : Sreedhanya Suresh

omkrish

omkrish