నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రత్యేక వ్యాసం రాసినవారు తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్

నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రత్యేక వ్యాసం రాసినవారు తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్

తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018 గురించి రాష్ట్రంలోని వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు .

వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండ నవీన్ మాటల్లో.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అనేక నూతన సంస్కరణలకు స్వీకారం చుట్టిన ప్రభుత్వం అందులో భాగంగా నూతన పంచాయతీరాజ్ చట్టం-2018ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం రాష్ర్టంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక స్వపరిపాలనకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది.
మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు 1959 నవంబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీకారం చుట్టారు.
73 రాజ్యాంగ సవరణ చట్టం కోసం తెలంగాణ సర్కారు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీశ్ రావు, ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
2018 మార్చి 29న తెలంగాణ శాసనసభ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018ను ఆమోదించింది.
తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం 2018 ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని మొత్తం భాగాల సంఖ్య – 9
ఈ చట్టంలోని మొత్తం చాప్టర్ల సంఖ్య – 10
ఈ చట్టంలోని మొత్తం సెక్షన్ల సంఖ్య – 297 నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 – గ్రామాల స్వరూపం:
తెలంగాణ రాష్ర్ట జనాభా – 3,50,31,077
గామ జనాభా – 2,02,50,978 (58 శాతం)
గామ పంచాయతీలు (పాతవి) – 8690
కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు – 4383
తెలంగాణ రాష్ర్టంలో మొత్తం గ్రామ పంచాయతీలు – 12,751
వార్డులు – 1,13,380
వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు – 1326
షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయతీలు – 1311
తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్టీ గ్రామ పంచాయతీలు – 2637
అత్యధిక గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా- నల్గొండ (844)
అత్యల్ప గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా- మేడ్చల్ మల్కాజ్‌గిరి భారత రాజ్యాంగంలోని 243(ఎ) అధికరణ గ్రామసభ ఏర్పాటు గురించి పేర్కొంటుంది.
నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 3 గ్రామసభ ఏర్పాటు గురించి వివరిస్తుంది
ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామసభ ఉంటుంది. గ్రామసభలో ఆ గ్రామానికి చెందిన రిజిస్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు.
గ్రామసభ సమావేశాలు:
తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఆరు సార్లు గ్రామసభ సమావేశం జరగాలి.
ఈ సమావేశాలు సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.
గ్రామసభ సమావేశాల ఎజెండాను తయారుచేసేది – పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ)
గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది – సర్పంచ్
ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనపుడు ఉపసర్పంచ్, ఒకవేళ వీరిద్దరూ లేనప్పుడు వార్డు సభ్యులందరూ ఎన్నుకున్న సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు.
గ్రామసభ సమావేశాలకు ఆహ్వానితులు – మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, రాష్ర్ట విధాన సభ (అసెంబ్లీ) సభ్యులు.
కోరం :
గ్రామసభ నిర్వహించడానికి కావల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. కోరం గురించి నూతన పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 10 తెలియజేస్తుంది.
గ్రామసభలోని రిజిస్టర్‌ ఓటర్లు కోరంనకు కావాల్సినసభ్యుల సంఖ్య
500లోపు 50
501-1000 లోపు 75
1001-3000 లోపు 150
3001-5000 లోపు 200
5001-10,000 లోపు 300
10,000లకు పైగా 400 గ్రామసభ విధులు:
1. గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన
2. ఆడిట్ నివేదికలు పరిశీలించడం, ఆమోదించడం
3. అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయడం
4. నూతనంగా పన్నులు విధించడం లేదా పన్నులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడం సర్పంచ్:
సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు అంటారు.
గ్రామ పంచాయతీ రాజకీయ కార్య నిర్వహణ అధిపతియే సర్పంచ్.
సర్పంచ్‌గా పోటీచేయడానికి 21 సంవత్సరాల వయసు ఉండాలి.
1994 తర్వాత జన్మించిన ముగ్గురు పిల్లలు ఉండకూడదు.
ఇతని పదవీ కాలం 5 సంవత్సరాలు.
గ్రామంలోని ఓటర్లందరూ పార్టీరహితంగా ప్రత్యక్షంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
ఒకవేళ ఏదైనా కారణంతో సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలలు (120 రోజులు) లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించి స్థానాన్ని భర్తీచేయాలి.
సర్పంచ్ గ్రామ పంచాయతీకి ఎక్స్-ఆఫీసియో సభ్యునిగా ఉండి అన్ని సమావేశాల్లో పాల్గొంటాడు, ఓటు హక్కును కలిగి ఉంటాడు.
సర్పంచ్‌తో ప్రమాణ స్వీకారం చేయించేది ప్రత్యేక అధికారి
సర్పంచ్ తన రాజీనామా లేఖను ఓపీవోకు అందించాలి.
సర్పంచ్‌కు నెలకు 5000/-వేతనం ఇస్తున్నారు.
రాజీనామా & తొలగింపు:
సర్పంచ్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే జిల్లా కలెక్టర్ అతనిని పదవి నుంచి తొలగిస్తారు.
సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదు.
గ్రామసభ సమావేశాలు సంవత్సరంలో కనీసం రెండుసార్లు (పర్యాయాలు) నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు.
గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనపుడు పదవి కోల్పోతాడు. ఇతడు గ్రామ పంచాయతీకి నోటీస్ ఇచ్చి రాజీనామా చేయవచ్చు. సర్పంచ్ విధులు:
ఇతడు గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు.
గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఏ సమాచారాన్నైనా కోరవచ్చు.
పంచాయతీ కార్యదర్శిపై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు.
గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తాడు.
గ్రామ పంచాయతీని కనీసం నెలకొకసారి, గ్రామసభను 6 నెలలకు ఒకసారి (కనీసం) సమావేశపరచాలి.
నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్,ఉప సర్పంచ్ కి జాయింట్ చెక్‌పవర్ ఇచ్చారు.
1. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్
2. 13వ ఆర్థిక సంఘం నిధులు
3. స్టేట్ ఫైనాన్‌‌స కమిషన్‌‌స విధులు
4. బి.ఆర్.జి.ఎఫ్ (బ్యాక్ వర్డ్ రిజియన్స్ గ్రాంట్స్ ఫండ్స్
5)ఎంజిఎన్ఆర్ఇజిఎస్(మహాత్మ గాంధీ నేషనల్ రురల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్) సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది.
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు రొటే ట్ అవుతాయి
సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు మహిళలు రిజర్వేషన్ డ్రా తీయాలి.
ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాను బట్టి తగినన్ని సీట్లు కలెక్టర్ రిజర్వు చేస్తాడు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాలు ఎస్టీలకే రిజర్‌‌వ చేయాలి.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన గౌరవ వేతనాలు:
1. సర్పంచ్ – రూ.5000
2. ఉప సర్పంచ్ – లేదు
3. వార్డు సభ్యులు – లేదు
4. ఎంపీటీసీ – 5000
5. ఎంపీపీ – 10,000
6. జెడ్పీటీసి – 10,000
7. జెడ్పీ ఛైర్మన్ – రూ.లక్ష ఎన్నికలలో ఎవరు ఎంత డిపాజిట్ చెల్లించాలి:
పదవి బీసీ ఎస్సీ/ఎస్టీ
సర్పంచ్ రూ.2000/- రూ.1000/-
వార్డు సభ్యులు రూ.500/- రూ.250/-
ఎంపీటీసీ రూ.2500/- రూ.1250/-
జెడ్పీటీసీ రూ.5000/- రూ.2500/-

రాజీనామా ఎవరు ఎవరికీ సమర్పించాలి సర్పంచ్- డీపీవో
ఉపసర్పంచ్ – ఎంపీడీఓ
వార్డుసభ్యులు- ఎంపీడీఓ
ఎంపిటీసీలు- జడ్పీ సీఈఓ
జడ్పీటీసీలు – కలెక్టర్
ఎంపీపీ – జెడ్పీ సీఈఓ
జడ్పీ చైర్మన్ – కలెక్టర్

ఉప సర్పంచ్: ఉప సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరూ కలసి 5 సంవత్సరాల పదవీ కాలానికి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
ఇతని ఎన్నికను జిల్లా పంచాయతీ అధికారి కాని అతను నియమించిన సంబంధిత అధికారి గాని నిర్వహిస్తాడు.
ఇతను తప్పనిసరిగా వార్డు సభ్యుడై ఉండాలి.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఉపసర్పంచ్‌ను వార్డు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు.
సర్పంచ్ కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
గ్రామ పంచాయతీ అకౌంట్‌లను ఆడిట్ చేస్తాడు.
ఉప సర్పంచ్ రాజీనామా: ఉప సర్పంచ్ తన రాజీనామాను ఎంపీడీవో కు గానీ, లేదా అతనికి పంపడం కుదరకపోతే జిల్లా పంచాయతీ అధికారికి ఇవ్వాలి.
ఉప సర్పంచ్‌ను సగం మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగిస్తారు.
ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పదవి కాలంలో రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి.
పదవి చేపట్టిన మొదటి రెండు సంవత్సరాల లోపు పెట్టకూడదు.
మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు రెండో తీర్మానాన్ని పెట్టకూడదు.
ఉప సర్పంచ్‌ను పదవి నుంచి జిల్లా కలెక్టర్ తొలగిస్తాడు.
గ్రామ పంచాయతీ వార్డు జనాభా సభ్యుల సంఖ్య
300 వరకు జనాభా 5
301-500 వరకు 7
501-1500 వరకు 9
1501-3000 వరకు 11
3001-5000 వరకు 13
5001-10,000 వరకు 15
10,001-15,000 వరకు 17
15,001-25,000 వరకు 19
25,000ల కన్నా ఎక్కువ 21

వార్డు సభ్యుడు -ప్రాథమిక సమాచారం

గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు. వార్డు సభ్యత్వానికి అర్హత
పార్లమెంటు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
స్థానిక సంస్థలకు పోటీచేయడానికి కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి.
ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొనే సభ్యులు:
1. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు
2. ఎంపీటీసీ సభ్యులు
3. గ్రామ పంచాయతీ కో-ఆప్షన్ సభ్యులు
4. మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీలకు 1964లో ఎన్నికలు జరిగాయి.
1981 మొదటిసారిగా సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు గ్రామ పంచాయతీ విధులు రెండు రకాలు :
1. ఆవశ్యక విధులు
2. వివేచనాత్మక విధులు సర్పంచ్ గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌నందు ఉన్న 29 విధులను గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది. తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు

omkrish