భ‌ర్త ఇంటికొచ్చేయ్ అన్నాడు. నాలుగోసారి IPS అయ్యి వ‌చ్చింది.!

భ‌ర్త ఇంటికొచ్చేయ్ అన్నాడు. నాలుగోసారి IPS అయ్యి వ‌చ్చింది.!

ఈమె పేరు N Ambika .. 14 ఏళ్ల‌కే పెళ్లైంది, 18 ఏళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి.! ఈమె భ‌ర్త త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్.. ఓ రోజు విధి నిర్వాహ‌ణ‌లో త‌న పై ఆఫీస‌ర్ల‌కు త‌న భ‌ర్త సెల్యూట్ కొట్ట‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోయిన అంబికా…ఎందుకిలా? అని అడిగింది. వాళ్ళు పెద్ద ఆఫీస‌ర్లు పెద్ద చ‌దువులు చ‌దివారు అందుకే వారి గౌర‌వార్థం ఇలా సెల్యూట్ కొట్టాలి అని చెప్పాడు.

అయితే నేను కూడా వారిలా పెద్ద ఆఫీస‌ర్ ను అవుతా…అనింది అంబికా అప్ప‌టికీ ఆమె ఇంకా ప‌ద‌వ‌త‌ర‌గ‌తి కూడా పూర్తికాలేదు. న‌వ్వాపుకుంటూ మొద‌ట ఆ ప‌ద‌వ‌త‌ర‌గ‌తి పాస్ అవ్వు అన్నాడు భ‌ర్త‌.

అంబికా ఆ మాట‌లు… జోక్ గా అన‌లేదు. క‌సితోనే అంది…అందుకే ప‌ది, ఇంట‌ర్ , డిగ్రీ చ‌కాచ‌కా పాస్ అయ్యింది. సివిల్స్ కోచింగ్ నిమిత్తం చెన్నై వెళ్లింది. ఈ టోట‌ల్ జ‌ర్నీలో భ‌ర్త స‌పోర్ట్ గా ఉన్నాడు. కోచింగ్ కొర‌కు చెన్నైలో మంచి హాస్ట‌ల్ చూసి అందులో చేర్పించాడు. పిల్ల‌ల బాధ్య‌త కూడా మొత్తం త‌నే చూసుకున్నాడు.

మొద‌టి అటెంప్ట్ ….ప్రిలిమ్స్ పోయింది. రెండవ అటెంప్ట్ మెయిన్స్ పోయింది. మూడ‌వ అటెంప్ట్ మెయిన్స్ పోయింది. భ‌ర్త ఇక చాలు వ‌చ్చేయ్.. ఏం కాదులే అన్నాడు. కానీ ఆమె ఇదొక్క‌సారి అని త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగించింది. నాల్గ‌వ‌సారి ప్రిలిమ్స్ , మెయిన్స్ , ఇంట‌ర్వ్యూల‌లో విజ‌యం సాధించి…ఫైన‌ల్ గా IPS అయ్యి ఇంటికి చేరింది.

నా బ‌తుకింతే .., నాత‌ల‌రాత ఇంతే అని కూర్చుంటే అంబికా కూడా అక్క‌డే ఉండేది. ధైర్యంగా అడుగేసింది కాబ‌ట్టే త‌న ల‌క్ష్యాన్ని సాధించింది.

omkrish