తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గా వేముల సైదులు నియామకం

తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్న కుమారస్వామి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేయడం జరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గా కక్కిరేణి గ్రామం,రామన్నపేట మండలం,యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వేముల సైదులు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమలులోకి వస్తాయని తెలిపారు.నూతనంగా నియమితులైన యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ వేముల సైదులు మాట్లాడుతూ వార్డ్ మెంబర్ల సమస్యలపై,హక్కులపై పోరాడతానని,వార్డ్ మెంబర్లకు గౌరవ వేతనం 3 వేల రూపాయలు సాధించేంతవరకు పోరాడతానని తెలిపారు.జిల్లాలోని ఏ వార్డ్ సభ్యునికి కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు.రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ కి,తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరంకి విశ్వాసం,విధేయత కలిగి నిబద్దతతో పని చేస్తానని అన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గా నియమించి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ కి,ప్రోత్సహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి కి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలోని వార్డ్ మెంబర్ల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి,రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిని సంతోష్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రమోద్ మరియు వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

omkrish