Bandi Sanjay – Telangana BJP President

Bandi Sanjay – Telangana BJP President

చిన్ననాటి నుంచి స్వయం సేవక్‌గా అలవాటైన క్రమశిక్షణ… హిందూ ధర్మంపై విశ్వాసం… విద్యార్థి ఉద్యమాల నుంచి అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా అందించిన సేవలు… అవినీతి మకిలి దరికి చేరనీయకపోవడం… 47 సంవత్సరాల ఓ సామాన్యుడు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది. రెండుసార్లు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సంజయ్‌ భారీ మెజారిటీతో ఏకంగా కరీంనగర్‌ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నిత్యం ప్రజలతో మమేకం కావడం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తన విజయానికి కారణమని ఆయన చెబుతున్నారు. 

     మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం. నాన్న బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్‌గా ఉండేవారు. కాని ఎక్కువ కాలం డిప్యూటేషన్‌ మీద జిల్లా పరిషత్‌లో విధులు నిర్వహించారు. అమ్మ గృహిణి. మేం నలుగురం సంతానం. ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఇంట్లో అందరికన్నా చిన్న వాడిని నేను. కరీంనగర్‌ కాపువాడలో నివసించేవాళ్లం. తరువాత జ్యోతినగర్‌కు షిఫ్ట్‌ అయ్యాం. నాన్న రిటైర్‌ అయిన తరువాత కూడా ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. 25 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ ఇంటిపైన ట్యాంక్‌ కూలి నాన్న చనిపోయారు. అందరికీ నాన్న మంచి చదువులు చదివించారు. ముగ్గురు అన్నదమ్ములం ఇప్పటికీ కలిసే ఉంటాం. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం మాది. 

23 ఏళ్లకే అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ను.. ఇప్పుడు ఎంపీ 1994లో 23 ఏళ్ల వయస్సులోనే కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం సాధించాను. తిరిగి 2000 సంవత్సరంలో మారోసారి బ్యాంకు డైరెక్టర్‌ను. 2005లో కౌన్సిలర్‌గా బీజేపీ నుంచి తొలిసారి గెలిచాను. 2010లో 48వ డివిజన్‌కు మరోసారి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో గెలిచాను. 2014, 2018లలో కరీంనగర్‌  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయాను. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు అందరికన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాను. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త నుంచి ఢిల్లీ పార్లమెంటులో సభ్యుడిగా ఎన్నికవడం ప్రజలు నామీద ఉంచిన అభిమానమే. 


1996లో అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్‌ రథయాత్ర దేశంలో సాగింది. అందులో భాగంగా కరీంనగర్‌ యాత్రకు వచ్చినప్పుడు తెల్లవారు జామున చౌరస్తాలో జెండాలు కడుతుంటే అప్పటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ జీ చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తరువాత వెంకయ్యనాయుడుకు చెప్పి, నన్ను అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు. ఎన్నికల నేపథ్యంలో రథయాత్ర నిలిచిపోవడంతో ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా పంపించారు. సెంట్రల్‌ ఆఫీసులో ఉండి అద్వానీ గారికి, వెంకయ్యనాయుడుకు సేవలు అందించాను. నాకు స్ఫూర్తి ప్రదాతలు విద్యాసాగర్‌ జీ, వెంకయ్యనాయుడు.

చిన్న నాటి నుంచి స్వయక్‌ సేవక్‌నే..
కాపువాడలో ఉన్నప్పుడు నన్ను ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్‌లో చేర్పించారు. శిశుమందిర్‌ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. నిత్యం శాఖకు వెళ్లేవాడిని. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యస్థాయిలోనే పనిచేశా. నాకు విద్యతోపాటు క్రమశిక్షణ సరస్వతి శిశుమందిర్‌ ద్వారా వచ్చింది. నాయకత్వ లక్షణాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నేర్పింది. నేనిప్పటికీ స్వయక్‌ సేవక్‌ని అని చెప్పుకోవడానికి గర్వపడతాను.


అపర్ణతో మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో 2002లో జరిగింది. ఇద్దరు పిల్లలు. పెద్దబాబు సాయి భగీరథ్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం. చిన్నోడు సాయి సుముఖ్‌ ఐదో తరగతి. అపర్ణ ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌. నేను బ్యాంకు డైరెక్టర్‌గా, కార్పొరేటర్‌గా, బీజేపీ నాయకుడిగా కుటుంబానికి తగిన సమయం ఇవ్వకపోయినా, అపర్ణ ఉద్యోగం చేస్తూనే కుటుంబాన్ని నడిపించింది. పిల్లలు నాతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లాలని అనుకున్నా, టైం ఇవ్వలేని స్థితి. మా ఆవిడే అన్నీ చూసుకుంటుంది.

More Visit: Telangana BJP President

Video Song: Bandi sanjay anna songs

omkrish

omkrish

Leave a Reply

Your e-mail address will not be published.