Brihadeeswarar Temple History

బృహదీశ్వర ప్రాచీన శివాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి కలశం వరకు 216 అడుగుల ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది. సూర్యుడు ఎటు వైపున వున్నా కూడా ఈ మందిరం నీడ నేలపై పడదని, మందిర నిర్మాణంలో చూపించిన నైపుణ్యం ప్రస్తుత శిల్పులు కనుగొనలేక పోయేరని అంటారు.
ఈ ఆలయం అతి పెద్ద దక్షిణ భారత దేవాలయాలలో ఒకటి. అద్భుతమైన ద్రావిడ నిర్మాణాలకి ప్రతీక. దీనిని దక్షిణ మేరుగా పిలుస్తారు. క్రీ.శ 1003 మరియు 1010 మధ్య తమిళ రాజు రాజా రాజా చోళ I నిర్మించారు. “గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు” గా పిలువబడుతున్న దేవాలయాల్లో ఒకటి. రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటు తున్నాయి.
నిర్మాణ విశేషాలు
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది.
ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు.
అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది.
- ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
- ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది. 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పూర్తిఅయినది. పూర్తిగా గ్రానైట్ తో నిర్మితమైన మొట్టమొదటి ఆలయం.
- పెద్ద కలశం సుమారు 81.28 టన్నులు బరువు కలిగి నల్లరాతితో చేయబడినది. క్రేన్స్ లేని కాలంలోనే 81.28 టన్నులు బరువు రాతి కలశాన్ని రాతిని 200 అడుగుల గోపురం పైకి ఎలా తీసుకువెళ్ళారో అంతు పట్టని విషయం.
- పునాదులు దగ్గర నుండి గోపురం వరకు అన్నీ రాళ్లతో నిర్మించబడినది. ఈ రాళ్ళను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై అనే ప్రాంతంలోని రెండు కొండలను తొలిచి తీసుకొని వచ్చారు.
- 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. భారతదేశంలో 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే. ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్, ఇటుకలు , ఉక్కు సున్నపురాయి వాడలేదు.
- మనం మాట్లాడుకునే శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
- మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము.
- ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి.
- ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.
- అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2. 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
- గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.
- ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య “కరణ”లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.
- దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకుల చేతనూ నిర్మింపబడినవి.
- ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి.
- ఈ ఆలయంతో కీల్పెరుంపల్లం ఆలయానికి భూగర్భ సొరంగం ఉంది.
ఆలయ విగ్రహాలు
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
This information is taken from : మహానుభావులు-mahanubhavulu