చార్లీ చాప్లిన్ గురించి

చార్లీ చాప్లిన్ ఒక అద్భుతమైన విభిన్నమైన కళాకారుడు, హాస్య చక్రవర్తి. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.
బాల్యం – బతుకు పోరాటం
చార్లెస్ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి-యాదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు ‘వాడెవిల్’ అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.
రంగస్థలం
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి “From Rags to Riches ” అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు.
మూగ సినిమాల చక్రవర్తి
చాప్లిన్ మెదటి వన్ రీలు సినిమా 1914 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైనది. రెండవది ఆ పిదప అయిదు రోజులకే ఫిబ్రవరి 7వ తేదీన, మూడవది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైనాయి. ఆ ఏడాది 1914 లో అతనివి మొత్తం 35 వన్ రీల్, టూ రీల్ చిత్రాలు విడుదలైనాయి. అంటే సగటున సుమారు పది రోజుల కొకటి చొప్పున. ఒక ఏడాది గడిచేసరికి 1915 లో ఎస్సెనే అనే కంపెనీవారు వారానికి 1240 డాలర్ల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1916-1917 సంవత్సరాలలో మ్యూచువల్ అనే కంపెనీవారు చాప్లిన్‌ను వారానికి 10వేల డాలర్ల జీతానికి తీసుకున్నారు. ఆ రోజులలో హాలీవుడ్‌లో అంత జీతం తీసుకునే నటుడు, అంత డిమాండ్ వున్న నటుడు మరొకడు లేడు. 1916-1917 సంవత్సరాల నాటికి – అంటే సినిమాలలో ప్రవేశించిన రెండు మూడేళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంత మారుమోగిపోయిందంటే 1918లో ఫస్ట్ నేషనల్ సర్కూట్ అనే కంపెనీ వారు అతడిని 18 నెలలలో 8 చిత్రాలు తీసిపెట్టమని 10 లక్షల డాలర్ల ఒప్పందం కుదురుచుకున్నారు.
ఆ తరువాత 1923 ప్రాంతాలలో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ, స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత సుమారు 30 ఏళ్లలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు. వాటిలో ఆఖరిది ” ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ “.
ట్రాంప్ (దేశద్రిమ్మరి) – కొత్త అవతారంసవరించు
ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్, క్లౌనింగ్, మైమింగ్, బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ – వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక – ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే, అన్ని పేర్లూ అతనివే.
ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడుగా బితుకుబితుకు మంటూ వుండేవాడు. అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరికతలో సామాన్య మానవుడునిస్సహాయుడుగా వుండిపోతున్నాడు. ఈ అల్పమావుడి ద్వారా అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు. అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి. సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది . ట్రాంప్ అలాంటి చిత్రం: కిడ్ లాంటి చిత్రం, సిటీ లైట్స్కూడా అలాంటిదే. సినీ జీవిత చరమ దశలో తీసిన లైమ్ లైట్ ‘ లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది.
విజయ పథం
అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోను ఒక చార్లీ వుండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ వుండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్‌తో ఆగిపోలేదు . దానికి మానవతా వాదమనే కొత్త డైమెన్షన్‌ను కల్పించాడు. ఒక అర్థశతాబ్థానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, పిఛీథన్నననిక, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు.
More Information Visit: Wikipedia