టామ్ అండ్ జెర్రీ – దర్శకుడు ఇకలేరు

టామ్ అండ్ జెర్రీ… చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ షోని చూస్తారు. ఎంతో ప్రజాదరణ పొందింది. అప్పట్లో ప్రారంభమైన ఈ కార్టూన్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
ఆస్కార్ విజేత, దర్శకుడు, దిగ్గజ యానిమేటర్, ఇలస్ట్రేటర్, కామిక్ ఆర్టిస్ట్ అయిన జీన్ డీచ్ కన్నుమూశారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో ఏప్రిల్ 16న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన యానిమేటెడ్ సిరీస్ ‘టామ్ అండ్ జెర్రీ’, ‘పొపేయే ది సైలర్’లకు డీచ్ దర్శకత్వం వహించారు. అలాగే.. మున్రో, టామ్ టెర్రిఫిక్, నుండిక్ కార్టూన్లకు డీచ్ సృష్టికర్త. ఈయన 1924 ఆగస్టు 8న అమెరికాలోని చికాగోలో జన్మించారు. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే.
చిత్ర కళలపై మక్కువ ఉండటంతో ఎక్కువతో అనేక కార్టూన్స్ గీసారు జీన్. ఈ క్రమంలోనే మన్రో అనే చిత్రం కూడా తెరకెక్కించారు. 1960లో బెస్టు యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. సినిమాలు, సీరియల్స్‌తో బిజీ బిజీగా గడిపే ప్రేక్షకులని కార్టూన్ సీరియల్స్ వైపు దృష్టి మరల్చేలా చేసిన ఘనత జీన్ డిచ్ది. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా లభించింది
More Information visit : Wikipedia
Gene Deitch Books