Kondagattu Hanuman Temple Story

Kondagattu Hanuman Temple Story

తెలంగాణ లో  పేరుగాంచిన  పుణయక్షేత్రంలో  కొండగట్టు ఒకటి. ఇది జగిత్యాల జిల్లా, మల్లియల్ మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కి.మీ. దూరములో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.

Kondagattu Hanuman

దేవాలయ చరిత్ర

పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.

సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణా లలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనబడగా, సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ‘శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్పజలాలు రాలి, స్వామివారి పాదాలను తడి పాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు ‘అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడింది.

శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

విగ్రహంలోని విశేషం

ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

More Information Visit : Wikipedia

Hanuman Chalisa Telugu Songs
Vemulawada to Kondagattu Route Map

Hanuman Chalisa Telugu:-

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||

ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||

సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహా~ం తే |
కవి కోవిద కహి సకే కహా~ం తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనో~ం లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట సే~ం హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాయీ |
జహా~ం జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవ కీ నాయీ || 37 ||

జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ | బోలో భాయీ సబ సంతనకీ జయ |

omkrish