లాక్ డౌన్ కారణంగా పనిలేదని.. ఏకంగా బావినే తవ్వేసిన దంపతులు..

లాక్ డౌన్ కారణంగా పనిలేదని.. ఏకంగా బావినే తవ్వేసిన దంపతులు..

లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆ దంపతులు ఏకంగా బావినే తవ్వేశారు. ఎగతాళి చేసిన పొరిగింటివాళ్ల నోళ్లు మూయించారు.

వాళ్లు కష్టాన్ని నమ్ముకున్న జీవులు. ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, మొబైళ్లు చూస్తూ.. వెరైటీ వంటకాలు వండుతూ కాలక్షేపం చేయలేని నిరు పేదలు. లాక్‌డౌన్ వల్ల బయట పనులు లేక ఇంటికే పరిమితమైన ఆ దంపతులకు.. ఎన్నాళ్ల నుంచో ఎదుర్కొంటున్న నీటి సమస్య గుర్తుకొచ్చింది. తమ నీటి అవసరాలు తీరాలంటే బావి ఉండాలని భావించారు. కానీ, మొదట్లో అది సాధ్యమేనా అనే సందేహించారు. ప్రయత్నించి చూస్తే పోయేది ఏముందని ఆ పనికి నడుం కట్టారు. చివరికి సాధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసీం జిల్లా కర్ఖేడా గ్రామంలో చోటుచేసుకుంది.
కర్ఖెడాలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో గజానన్ దంపతులు తమ ఇంటి వద్దే బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. పలుగు, పారా పట్టుకుని పని మొదలుపెట్టారు. అలా కొంచెం మట్టిని తవ్వేస్తూ 21 రోజుల్లోనే ఎవరి సాయం లేకుండా 25 అడుగుల లోతైన బావిని తవ్వేశారు. అయితే, వారి శ్రమ వృథాపోలేదు. వారి కష్టాన్ని చూసి.. గంగమ్మ పరవళ్లు తొక్కింది.

గజానన్ దంపతులు ఎలాంటి ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా చేతి పనిముట్లతోనే బావిని తవ్వేయడం గమనార్హం. ఈ సందర్భంగా గజానన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల మేం బయటకు వెళ్లడం లేదు. దీంతో నీటి అవసరాలను తీర్చుకొనేందుకు బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాం. నా భార్య పూజ చేసిన తర్వాత బావిని తవ్వడం మొదలుపెట్టాం. ఇది చూసి పొరుగింటివాళ్లు ఎగతాళి చేశారు. 21వ రోజే గంగమ్మ తల్లి 25 అడుగుల ఎత్తుకు చేరింది’’ అని తెలిపాడు….

This article given by : మహానుభావులు-mahanubhavulu

omkrish