గ్రామపంచాయతీ లో సర్పంచ్ కే కాదు వార్డు మెంబర్స్ కుాడా చాలా అధికారాలు ఉన్నాయి..!

గ్రామపంచాయతీ లో సర్పంచ్ కే కాదు వార్డు మెంబర్స్ కుాడా చాలా  అధికారాలు ఉన్నాయి..!

తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొండ నవీన్ !!

ఏదో సంతకం పెట్టమంటే పెట్టెయ్యడం కాదు..

మీ అధికారాలు మీరు తెలుసుకోవాలి..

అప్పుడే మీరు గ్రామాలకు,మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయగలరు..

అసలు వార్డు మెంబర్స్ అంటే ఎవరు?

గ్రామపంచాయితీలో వారి పాత్ర ఏంటి?

గ్రామపంచాయితీలో జనాబా ఆదారంగా గ్రామపంచాయితీలో సభ్యులను ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న సభ్యులనే గ్రామపంచాయితీ సభ్యులంటారు.లేదా వార్డుమెంబర్స్ అంటారు..

ఒక గ్రామానికి కనిష్టంగా 5 మంది ఉంటారు.
మేక్సిమం 21 మంది ఉంటారు..

300 మెంబర్స్ కు 5 మంది 15 వేల మందికి 19 నుండి 21 మంది. ఉంటారు..

గ్రామపంచాయితీ సభ్యులను గ్రామపంచాయితీ ఓటర్లే జనాభా ప్రతిపాదికన ఎన్నుకుంటారు. వీరు పార్టీ రహితంగా ఎన్నికౌతారు. వీరికి పార్టీ గుర్తులుండవు.ఉండడానికి వీల్లేదు కుాడా..!

వార్డు సభ్యులను ప్రజలే ప్రత్యక్ష ఓట్ల ఎన్నికల పద్దతిన ఎన్నుకుంటారు..

గ్రామపంచాయితీలో ఓటర్గా నమెాదైన వ్యక్తి వార్డు సభ్యునిగా పోటి చేయవచ్చును..

వార్డు సభ్యునికి 21 సం వయస్సు కలిగి ఉండాలి. వీరి పదవీకాలం 5సం వీళ్ళకు ఎలాంటి వేతనం ఉండదు..

గ్రామపంచాయితీ సభ్యుల్ని, స్థానిక సంస్థల ప్రతినిధుల్ని తొలగించే అధికారం జిల్లాకలెక్టర్ కు ఉంటుంది..

అవిశ్వాశ తీర్మానం ద్వారా వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ను తొలగించవచ్చును..

గ్రామపంచాయితీ సమావేశాలు నిర్వహించేటప్పుడు సిటింగ్ అలనెన్స్ కింద రోజుకు 75 రుాపాయలు అందిస్తారు..

వార్డుమెంబర్లు గ్రామపంచాయితీ లోను,వివిధ కార్యచరణ అభివృద్ది కమిటీల లోను,వార్డుల లోను తమ యెుక్క బాద్యతలు నిర్వర్తించాలి..

వార్డుమెంబర్లు గ్రామపంచాయితీ సమావేశాల లో తప్పని సరిగా హాజరుకావాలి..

వార్డుమెంబర్లు తమ వార్డుకే కాక మెుత్తం గ్రామానికి సంబందించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వారు తప్పనిసరిగా హాజరయ్యి అన్ని విషయాలు తెలుసుకోవాలి..

అజెండా నోటీసు 3 రోజుల ముందే రాతపుార్వకంగా అందుతుంది కాబట్టి అందులో విషయాలు క్షుణ్ణంగా చదివి ఒక సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరవ్వాలి అలా అయితేనే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరు సమావేశంలో కుార్చున్నపుడు మెత్తం గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తుా చర్చలు అలానే నిర్ణయాల లో బాగస్వామ్యం వహించాలి..

వార్డు సభ్యులు పంచాయితీ సమావేశంలో కొత్త అంశాన్ని ప్రతిపాదించాలంటే వార్డు సభ్యుల ఆమెాదంతో చేర్చవచ్చు,చర్చించవచ్చు ఆ ప్రతిపాదనకు సంబందించి నిర్ణయాలుా చేయవచ్చు..

ప్రతీ వార్డు సభ్యుడుా గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి పంచాయితీ కార్యదర్శిని సంప్రదించి అవసరమైన సమాచారాన్ని ఒక రాతపుార్వకమైన నోటీసు ద్వారా పొందవచ్చు..

ప్రతీ సభ్యుడు పంచాయితీ సిబ్బందికి,నాయకులకు,ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించవచ్చు..

పంచాయితీ సిబ్బంది పనితీరు గ్రామ ప్రయెాజనాలకు ఇబ్బందికరంగా ఉంటే సర్పంచ్ దృష్టికి గాని,పంచాయితీ కార్యదర్శి దృష్టికి గాని తీసుకు వెళ్లాలి ఒకవేళ అలా తీసుకువెళ్లిన మార్పురాకుంటే సమావేశంలో చర్చించి సరైన నిర్ణయం,చొరవ తీసుకోవచ్చును..

పంచాయితీ ఆస్థులకు నష్టం కలుగుతున్నా లేక పంచాయితీ ఆస్థులు వృధా అవుతున్నాయని గమనించినా సర్పంచ్ మరియు కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లవచ్చును..

గ్రామపరిపాలనకు సంబంధించి అంశాల పైన
సర్పంచ్ ను సంప్రదించవచ్చు గ్రామ సర్పంచ్ కు సుాచనలుా,సలహాలు అందించవచ్చు మరియు సందేహాలు తీర్చుకోవచ్చు..

గ్రామపంచాయితీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల అమలును పర్యవేక్షించవచ్చు,పనుల నాణ్యత,సత్వరపుార్తి పనులకు సంబందించి సలహాలు,ఇవ్వడంలో వార్డుమెంబర్స్ కు అధికారముంటుంది..

ప్రత్యేక అంశాలను ప్రస్తావించదలస్తే అవసరాలు దృష్టిలో వుంచుకుని ప్రత్యేక సమావేశాల గురించి వార్డుమెంబర్లు డిమాండ్ చేయవచ్చును..

పంచాయితీ సభ్యునిగా పంచాయితీలోను,సమావేశాల లోను నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఒక సమగ్ర గ్రామాభివృద్దికి ప్రభుత్వం అనేక కమిటీలు వేసింది. ఆకమిటీలలో సరైన వ్యక్తులు వుండేలా వార్డుమెంబర్లు నిర్ణయించవచ్చును..

గ్రామపంచాయితీ సమావేశాల లో అతి ముఖ్యమైనది, కీలకమైనది బడ్జెట్ సమావేశం గ్రామపంచాయితీ ఆదాయ వ్యయాలను మదింపు చేసి ఉన్న వనరుతో ఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టవచ్చునో కీలక నిర్ణయాలను పంచాయితీ సమావేశాలలో నిర్ణయాలు చేస్తారు ఈ నిర్ణయాలనేవి గ్రామాభివృద్దికి ప్రభావితం చేస్తాయి.ఈ నిర్ణయాలు చేసే ప్రజాప్రతినిధులుగా వార్డుమెంబర్లు కీలకపాత్ర వహించాలి..

గ్రామసభలు పెట్టి ప్రజలయెుక్క సలహాలు, సుాచనలు ఆమెాదాన్ని పొందాల్సిన అంశాలను గ్రామపంచాయితీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ప్రవేశపెట్టాలి.
నిర్మాణాత్మక ప్రతిపాదనలు ప్రవేశపెట్టడంలో వార్డుమెంబర్ల పై ముఖ్యమైన బాద్యత ఉంది..

ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో అధ్యక్షత వహించే వ్యక్తి సర్పంచ్ తనను సమావేశం నుండి బయటకు పంపతే ఆవార్డుమెంబరు ఆ అధ్యక్షుడు ఉత్తర్వును సవాలు చేయవచ్చు..

సర్పంచ్ ఆ సవాలును సభలో ఉంచితే సమావేశ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది..

వార్డుమెంబర్స్ అధికారాలు,బాద్యతలు తెలుసుకున్నారుగా..!

పదవి చిన్నదైనా బోలెడన్ని అధికారాలు-బాద్యతలు ఇచ్చింది రాజ్యాంగం..

భారత రాజ్యాంగం ఇచ్చిన గౌరవప్రదమైన ఆ బాద్యతను సక్రమంగా నిర్వర్తించి గ్రామాభివృద్దికి తోడ్పడండి...

ఇట్లు
కొండ నవీన్
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం

omkrish

omkrish