కోయంబత్తూరులో రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ

కోయంబత్తూరులో  రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ

నేను చనిపోయే దాకా 1రూపాయికే ఇడ్లీ అమ్ముతా.ఎప్పటికీ ధర పెంచను. కమలాతాల్
ఇలా ఏంత మంది ఉంటారు.. లక్షకు ఓక్కరు ఉంటారో ఉండరో తేల్వదు గాని నేటి వారిమైన మనం ఈ అమ్మ’ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని…

ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. ఇప్పటికీ మా ఊరిలో రూపాయికే ఇడ్లీ దొరుకుతోంది. 10 రూపాయలతో కడుపునిండా తినొచ్చు. కొన్నిసార్లు మా దగ్గర డబ్బులు లేకున్నా ఆ బామ్మ ఏమీ అనరు. నా జేబులో రూ.500 ఉన్నా సరే, ఇక్కడే ఇడ్లీ తింటాను” అన్నారు వడివెలంపాలయం గ్రామానికి చెందిన రామసామీ.

“రోజూ పొద్దున 5.30 గంటలకు నిద్రలేస్తాను. చట్నీ, సాంబార్ చేస్తా. 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి” అని చెప్పారు.

ఈ బామ్మ చేసే ఇడ్లీలు, చట్నీ, సాంబార్ కూడా భలే రుచికరంగా ఉంటాయని రామసామీ అంటున్నారు.

ఈ వయసులోనూ బామ్మ రుబ్బురోలును వాడుతున్నారు. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని ఆమె అంటున్నారు.
“నేను రాగి జావ తాగేదాన్ని. అలాంటి ఆహారం తినడం వల్లే నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్నం తింటున్నారు. కానీ, బియ్యంలో సరైన పోషకాలు ఉండవు” అని ఆమె అన్నారు.
సాధారణంగా తమిళనాడులో ఒక ఇడ్లీ ఖరీదు రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కానీ, ఈ బామ్మ ఒక్క రూపాయికే ఇడ్లీ ఇవ్వడం అందరినీ ఆలోచించపజేస్తోంది.

“మా ఊరి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ ఉండే హోటళ్లలో ఒక్క దోశ తింటే 15 రూపాయలు అవుతాయి. అది తిన్న గంటలోపే మళ్లీ ఆకలేస్తుంది. అవే డబ్బులతో ఇక్కడ ఇడ్లీ కడుపునిండా తొనొచ్చు. మధ్యాహ్నం దాకా ఆకలి బాధే ఉండదు” మరో గ్రామస్థుడు సెల్వ సుందరం వివరించారు.

తాజాగా కోయంబత్తూరులో నిస్వార్థంగా ఒక్క రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదోడి ఆకలి తీరుస్తూ సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్. ఈమె నడుపుతున్న ఇడ్లీ షాపు గురించిన వార్త ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆనంద్ మహీంద్రా కంటపడింది.

అంతే…. ఆయన బామ్మ కమలాథల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది.
కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టౌవ్‌ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో పంపారు.

https://www.youtube.com/watch?v=JeTQigCOF_I

omkrish