ఒక రోళ్ళు అమ్ముకుంటున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎలా ఐంది

ఒక రోళ్ళు అమ్ముకుంటున్న మహిళ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐంది. ఆమె పేరే Padmashila Tirpude, బండారు జిల్లా, మహారాష్ట్ర కి చెందిది. వీరిది చాలా నిరుపేద కుటుంబం కూలి పని చేస్తూ రోళ్లు ఆమినది. 12 సంవత్సరాల క్రితం పవన్ తుకారాం అనే వ్యక్తి తో వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు. ఈ పేదరికం నుంచి బయటపడాలి తన భార్యా ని మల్లి చదవమని చెప్పారు. తన ఒకడే కూలి పనికి వెలేవాడు తన భార్యా చదివేస్తూ వుంటూ.మొదట్లో , ఉదయం నుండి మధ్యాహ్నం దాకా రాళ్ళు కొట్టి , రోళ్ళు తయారు చేసి , మధ్యాహ్నం దాటాక , పసి బిడ్డను చంకనేసుకొని , రోళ్ళను అమ్ముకొని , ఆ అర కొర పైసలతొనే బతుకు బండి ని లాగే ఈమె , ఆ పని చేస్తూనే రాత్రిళ్ళు చదువుకొని , పరీక్షలకు కట్టి , పాస్ అయ్యి , ఇంకా ముందుకు చదివి , ఇపుడు ఏకంగా police sub inspector అయ్యింది అంటే అది ఎంత గొప్పవిషయం కదా ! జీవితం లో విజయం సాధించడం ఎలా ? అన్న ప్రశ్న కు ” విజయానికి ఆరు మెట్లు లేదా ఏడు మెట్లు ” లాంటి పుస్తకాల్లో సమాధానం వుండదు. ఇలాంటి పుస్తకాలు వ్రాసిన రచయిత / లు , మరో రంగం లో కి అడుగుపెట్టి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన / వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఆయనకే / వాళ్ళకే పనికిరాలేదు. అలాంటి వాళ్ళు కొందరు ” వ్యక్తిత్వ వికాస నిపుణులు ” అనే పేరుతో పట్టణాల్లో ఇంజినీరింగ్ కళాశాలలకు , కార్పొరేట్ బళ్ళకు వస్తుంటారు. ఆయా కళాశాలలు , పాఠశాలల యాజమాన్యాలు వీళ్ళకు డబ్బు కూడా ఎక్కువగానే చెల్లించుకోవాలని విన్నాను. విజయానికి ఆరు , ఏడు , పది , పన్నెండు .. ఇలా ఎన్ని బడితే అన్ని మెట్లు వుండవు.
విజయానికి రెండే మెట్లు : ఒకటి : నీ పట్ల నీ కున్న ఆత్మవిశ్వాసం , రెండు : పరమాత్మ పట్ల నీకున్న విశ్వాసం. ఇవి రెండూ వుంటే మిగతావి నిన్ను వెతుక్కొంటూ వస్తాయి.