2000 వేల మంది అనాథలను పెంచిన అమ్మ సింధు తాయి

2000 వేల మంది అనాథలను పెంచిన అమ్మ సింధు తాయి

Sindhutai Sapkal ఒక భారతీయ సామాజిక కార్యకర్త, ముఖ్యంగా భారతదేశంలోని అనాథ పిల్లలను పెంచడంలో ఆమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురీది అనాథ పిల్లల కోసం పలు సంస్థలను ఏర్పాటు చేశారు. 2000 మంది అనాథలను పెంచి పెద్ద చేశారు.సోషల్ వర్క్ విభాగంలో ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఈమె జీవిత చరిత్ర మరాఠా భాషలో బయోపిక్‌ చిత్రంగా వచ్చింది

మహారాష్ట్రలోని వార్ధాలో ఓ పేద కుటుంబంలో పుట్టారు సింధుతాయ్. చాలా మంది పిల్లల లాగే ఆమె కూడా వివక్షను ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఆమె తల్లికి కూతురుని స్కూలుకు పంపడం ఇష్టం లేదు. కానీ తండ్రి ప్రోత్సహించి.స్కూలుకు పంపారు. కూతురికి 12 ఏళ్లు రాగానే.స్కూల్ మాన్పించి.ఆమె కంటే 20 ఏళ్ల పెద్ద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసింది.

పెళ్లి తర్వాత సింధును వార్ధాలోని నవర్గావ్‌కి భర్తతోపాటూ పంపించేశారు. ఆ భర్త ఏనాడూ ఆమెను భర్తలా చూడలేదు. గౌరవించలేదు. టీనేజ్‌లో సింధు ధైర్యం చేసింది. భర్తను లెక్క చెయ్యకుండా.స్థానికుల సమస్యలపై కదం తొక్కింది. అక్కడి అటవీ అధికారులు, భూస్వాముల అక్రమాలను ఎదుర్కొని స్థానిక మహిళలకు అండగా నిలిచింది.

20 ఏళ్ల వయసులో సింధు నాలుగోసారి గర్భం దాల్చింది. అప్పటికే 3సార్లు ఫెయిలైంది. ఈసారి కూడా ఆమెను భర్త చితకబాది చంపేస్తాడని స్థానికులు భావించారు. ఆ పరిస్థితుల్లో ఆమె.ఓ షెడ్డులో పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టాక భర్త ఆమెను వదిలేశాడు. దాంతో పుట్టింటికి రాగా… తల్లి పొమ్మంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆమె… వీధులు, రైళ్లలో అడ్డుక్కోవడం మొదలుపెట్టింది. అసలే రక్షణ లేని రోజులు. రాత్రి వేళ తన కోసం, తన కూతురి రక్షణ కోసం ఆమె శ్మశానాలు, గొడ్లచావిళ్లలో ఉండేది.

బాల్య వివాహాల సంకెళ్లతో నలిగి, బంధించబడినప్పటికీ, యువతి సింధుతాయి ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. బదులుగా నిస్సహాయులకు మరియు అన్యాయానికి గురైన వారికి సహాయం చేయాలనే ఆమె నిర్ణయించుకుంది.క్రమంగా బతుకుపోరాటంలో సింధు రాటుతేలింది. ఆ క్రమంలో ఆమె అనాథ పిల్లల ఆశ్రమం స్థాపించబడింది.

తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాక మీకు ఏమనిపిస్తోంది అని అడిగితే ఆమె ఏమన్నారో తెలుసా.”చాలా సంతోషం. ఈ అవార్డు వల్ల నా పిల్లలకు మరింత మందికి ఆకలి తీరే అవకాశం వస్తుంది” అన్నారు. అంతేకాదు. తాను ఇంత మందికి సాయం చేయడానికి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అవార్డును అంకితం చేస్తున్నానని అన్నారు.

omkrish

omkrish

Leave a Reply

Your e-mail address will not be published.