Sri Garikapati Narasimha Rao

శ్రీ నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు.
More Information Visit:Wikipedia
బిరుదులు
- ప్రవచన కిరీటి
- అమెరికా అవధాన భారతి
- ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997)
- సహస్రభారతి (1996)
- అవధాన శారద (1995)
- శతావధాన గీష్పతి (1994)
- శతావధాన కళా ప్రపూర్ణ
సత్కారాలు, పురస్కారాలు:
రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018 |
పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018 |
గురజాడ విశిష్ట పురస్కారం, 2016 |
లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015 |
శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013 (విశాఖ ఉక్కు కర్మాగారం) |
తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012 |
ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి వారిచే ప్రదానం, 2012 |
సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2012 |
కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం, 2011 |
అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం, 2008 |
‘సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు), 2005 |
నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ), 2004 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం, 2003 |
‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000 |
ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ, 1989 |
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు జయంతి రామయ్యపంతులు అవార్డు, 1978 |
Facebook Pages: Sri Garikipati Narasimha Rao
YouTube Channel: Garikapati Speeches
Books: Garikapati Books