Vijay Deverakonda Life Story

Vijay Deverakonda Life Story

విజయ్ దేవరకొండ (జననం 9 మే 1989), తెలుగు సినిమా నటుడు. ఈయన మే 9, 1989 న హైదరాబాద్ లో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవిలు తెలంగాణాలోని నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట గ్రామానికి చెందినవారు. తండ్రికి సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక మునుపే హైదరాబాదుకు వచ్చారు. సినిమాల్లో నటుడు అవ్వాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించాడు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ చానళ్ళలో ఆయన దర్శకత్వం వహించిన సీరియళ్ళు ప్రదర్శింప బడ్డాయి. విజయ్, ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.ఈ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు.

టీవీలు, ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాఠశాల ఉండేదనీ, అక్కడే తాను కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నానని వివరించారు విజయ్. ఈ రోజు తన ప్రవర్తన, వ్యక్తిత్వం మొత్తం ఆ పాఠశాలలో పెంపొందించుకున్నవే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్కూలు చదువు పూర్తయ్యాకా, హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు.2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.2017 మొదట్లో ద్వారక అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు.ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు.ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు.2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేశావో తో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు.మళ్ళీ అదే సంవత్సరం లో వచ్చిన గీత గోవిందం తో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .ఆ తర్వాత నవంబర్ 17-2018న టాక్సీవాలా తో మరొక్క చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.

Foundation:- Vijay Deverakonda

Vijay Deverakonda Movie List

Vijay Deverakonda

This information taken from Wikipedia

omkrish